వెబ్ మ్యాగజైన్ రంగంలో అద్బుత విజయం

updated: March 25, 2018 18:43 IST
వెబ్ మ్యాగజైన్ రంగంలో అద్బుత విజయం

ఫేస్ బుక్ లో నా పోస్ట్ కు వచ్చే కామెంట్స్ చదవటానికే టైమ్ సరిపోవటం లేదు ..మళ్లీ ఓ వెబ్ మ్యాగజైన్ చదవాలా...ద్యావుడా....ఓ బడాయి బాబు..పోచుకోలు కామెంట్
 ఇంటికి వచ్చే మ్యాగజైన్స్ నే  కారులో అలా వెళ్లేటప్పుడు తిరగేస్తూంటా...ఇప్పుడు వెబ్ లో కూడా మ్యాగజైన్స్ చదవాలా...అంత తీరిక ఎక్కడదండీ...ఓ బిజీ బాబు బిల్డప్ కామెంట్...

ఇలా మ్యాగజైన్ అంటేనే  చిత్ర విచిత్రంగా మాట్లాడే జనం ఉన్న ఈ రోజుల్లో వెబ్ మ్యాగజైన్ ని పెట్టి... దాన్ని ఐదేళ్ల పాటు అంతరాయం లేకుండా అద్బుతంగా నడపటం సాధ్యమా..ఆగండి.ఆగండి..ఆ వెబ్ మ్యాగజైన్ వచ్చేది తెలుగులో .. ఇప్పుడు చెప్పండి..సాధ్యమేనంటారా... మీరు నో అంటారని తెలుసు..కానీ Impossible అనే పదంలోనూ  possible అని ఉందని గుర్తించే బన్ను గారు అక్కడ ఉంది... ఇప్పుడు మళ్లీ చెప్పండి..సాధ్యమేనంటారా..యస్..సాధ్యమే... మేం చెప్పేది .... నిజం...మీరు ఆల్రెడీ ఆ మ్యాగజైన్ చూసే ఉంటారు..రెగ్యులర్ గా కూడా చూస్తూ ఉండి ఉంటారు..అదే http://www.gotelugu.com

  బన్ను గారు, ఫౌండర్ , గోతెలుగు.కామ్ , కార్టూనిస్ట్మ మరియు  సాఫ్ట్ వేర్ నిపుణలు 

 గో తెలుగు అని సింపుల్ పేరు ని.. వెబ్ సైట్ కి  పెట్టడంలోనే సగం సక్సెస్ ని సాధించి, ఆ తర్వాత విన్నూతమైన శీర్షికలు, కార్టూన్ లు, ఆర్టికల్స్ తో లాంచ్ చేసిన కొద్ది రోజుల్లో నే తెలుగువారి ఆదరాభిమానాలు పొందిందీ వెబ్ సైట్.  చక్కటి కుటుంబ వార పత్రిక అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ ఈ-పత్రిక..లో సీరియల్స్ రెగ్యులర్ గా చదివి నెక్ట్స్ వీక్ ఎడిషన్ కోసం చూసే వారు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి క్వాలిటీ కంటెంట్ ని ఈ వెబ్ సైట్ ఇస్తూంటుంది. 

ఇక కార్టూన్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వెబ్ సైట్ కార్టూనిస్ట్ లకు ఓ వరప్రదాయని లాంటిది. పెద్ద పెద్ద పత్రికలు కూడా కార్టూన్ పోటీలు పెట్టడానికి సందేహిస్తున్న ఈ రోజుల్లో ...స్వతహాగా కార్టూనిస్ట్ అయిన ఈ వెబ్ సైట్ యజమాని బన్ను గారు కార్టూన్ పోటీలు నిర్వహిస్తూ ఎంతో మంది కొత్త,పాత కార్టూనిస్ట్ లను ప్రోత్సహిస్తున్నారు. 

సినిమా విశేషాల నుంచి సమ్మర్ టిప్స్ దాకా హాట్ హాట్ గా అందించే ఈ వెబ్ సైట్ తో ఒకటే సమస్య..అలవాటు పడితే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. కాబట్టి ఆలోచించి..ఈ లింక్ ఓపెన్ చేయండి..http://www.gotelugu.com. అలాగే ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే ...మీ చుట్టూ ఉన్న ప్రపంచం మాయమైపోయి.. కొత్త ప్రపంచం ఆవిష్కారమవుతుంది.. దాన్ని నుంచి బయిటపడటానికి కాస్త టైమ్ పడుతుంది. జాగ్రత్త.

 పాతనీరు పోతుండటం, కొత్త నీరు వచ్చి చేరుతుండటం ప్రవాహ లక్షణం...అలాగే పాత వారిని కాపాడుకుంటూనే కొత్తవారిని ప్రోత్సహించటం పత్రికా ధర్మ..గో తెలుగు ఈ ధర్మాన్ని ఎప్పుడూ పాటిస్తూనే ఉంటోంది. ఇదే ఈ పత్రిక సంపాదకులు బన్ను గారు తొలి నుంచీ పాటిస్తూ వస్తున్న ధర్మం. అదే ఆయన సక్సెస్ మర్మం. ఆయనకు, గో తెలుగు టీమ్ కు  ఐదేళ్లు పూర్తైన సందర్బంగా శుభాకాంక్షలు చెప్తూ ఈ పత్రిక ఇలాంటి ఐదేళ్లు పండుగల ఎన్నో ,మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తోంది..

ఈ మ్యాగజైన్ లో ..ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు,సరసి గారు , గాందీ గారు కార్టూన్స్ నవ్విస్తే..సూర్య దేవరరామమోహన్ రావు గారి లాంటి టాప్ మోస్ట్ రైటర్స్ సీరియల్స్ పాఠకులను ఊహాలోకంలోకి తోసేస్తాయి. మాతృభాష తెలుగు భాష మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నామని బన్ను గారు చెప్తూంటారు

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: suryadevara ramamohan rao, suryadevara, gotelugu

comments